Tuesday, April 23, 2024
- Advertisement -

కీల‌క మ‌లుపు తిరిగిన అయోషా మీరా హ‌త్య కేసు..

- Advertisement -

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. మొదటి నుంచి ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో.. సిట్ మరో షాక్ ఇచ్చింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయంటూ సిట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.

ఆయేషా కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సిట్ ఈ విషయాన్ని తెలియజేసింది. విజయవాడ కోర్టలో ఆయేషా మీరా హత్యకేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమైనట్లు సిట్ తెలిపింది. హైకోర్టులో కేసు విచారణ నడుస్తున్న సమయంలోనే ధ్వంసమయ్యాయని తెలిపింది. సిట్ వివ‌ర‌ణ‌పై సీరియ‌స్‌గా స్పందించ‌న కోర్టు రికార్డుల ధ్వంసంపై విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.

ఈ కేసులో రాష్ట్ర పోలీసుల కన్నా సీబీఐ దర్యాప్తు మేలేమోననే అభిప్రాయపడింది. అలాగే సీబీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. 2014లోనే కేసు ఫైల్స్ ధ్వసంమైనట్లు విజయవాడ కోర్టుకు సిట్ తెలియజేసిందట.2007 డిసెంబర్‌లో బీ ఫార్మసీ చదవుతున్న ఆయేషా మీరాను విజయవాడలో ఆమె ఉంటున్న హాస్టల్‌లోనే దారుణంగా హత్య చేశారు. డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు.ఈ కేసులో అప్పుటి పోలీసులు అరెస్ట్ చేసిన సత్యం బాబును హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.ఈ కేసును తిరిగి విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో 2017 ఏప్రిల్ 2వ తేదీన సత్యం బాబు జైలు నుండి విడుదలయ్యారు.2014లో బాబు సీఎం అయిన త‌ర్వాత దీనిపై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -