అయోధ్య‌కేసులో మ‌రో ట్విస్ట్‌….కేసు 29కి వాయిదా

429
Ayodhya case: Justice UU Lalit Recuses Himself From Case
Ayodhya case: Justice UU Lalit Recuses Himself From Case

అయోధ్య కేసు వివాదం మ‌రో మలుపు తిరింగింది. ఈ రోజు కేసుపై విచార‌ణ‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం 29 కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ అంశంపై విచార‌ణ ప్రారంభించేందుకు నిరాక‌రించింది. రాజ్యాంగ ధ‌ర్మాస‌నం నుంచి జ‌స్టిస్ యూయూ ల‌ల‌త్ త‌ప్పుకున్నారు. జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌.. ఇదే కేసులో క‌ల్యాన్ సింగ్ త‌ర‌పున వాదించిన‌ట్లు అడ్వ‌కేట్ రాజీవ్ ధావ‌న్ త‌న పిటీష‌న్‌లో కోరారు. దీంతో ఈ బెంచ్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

జ‌స్టిస్ యూయూ ల‌ల‌త్ స్థానంలో కొత్త జ‌డ్జి వ‌చ్చేంత వ‌ర‌కు కేసు విచార‌ణ ముందుకు సాగే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. యిదుగురుస‌భ్యుల ధ‌ర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. కొత్త జ‌డ్జిని నియ‌మించే వ‌ర‌కు ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.