Friday, March 29, 2024
- Advertisement -

అయోధ్య‌కేసులో సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్ట్‌..

- Advertisement -

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారానే సాధ్యం అని స్ప‌ష్టం చేసింది. మధ్యవర్తిత్వం నెరపడానికి ముగ్గురితో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్‌లో జస్టిస్ ఖలీఫుల్లా, రవిశంకర్‌ ప్రసాద్‌, శ్రీ రామ్ పంచ్‌ల పేర్లను సూచించింది. 4 వారాల్లోగా మొదటి నివేదిక ఇవ్వాలని.. 8 వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయస్థానం. మీడియాకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచాలని సూచించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో కొనసాగాలని… చర్చలన్నీ సీసీ కెమెరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగాలని స్పష్టం చేసింది. ఇక అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదస్పద భూమిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగా.. రామ్‌లల్లా, నిర్మోహ అఖోడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు మధ్య ఈ వివాదం నడుస్తోంది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి ఎవ‌రిదో ఈ ప్యానెల్ తేల్చ‌నుంది. 2010లో 2.77 ఎకరాల భూమిని అలహాబాద్‌ కోర్ట్‌ ముగ్గురికి పంచింది. ఈ తీర్పుపైనే ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -