Thursday, April 18, 2024
- Advertisement -

తెలుగు మీడియాకు ఇది గడ్డుకాలం.!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్రవంతి మీడియాకు ఇది గడ్డుకాలంగా మారింది. ఎలక్ట్రానిక్ మీడియాతో సహా చాలా ప్రధాన పత్రికలు , మీడియా సంస్థలు ఖర్చు తగ్గించుకోవడం, ఉద్యోగులను తగ్గించడం చేస్తున్నాయి. దీంతో జర్నలిస్టులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు.

ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు దినపత్రికలలో వాటి పత్రిక ఎడిటర్ లు కూడా సరిగ్గా జీతాలు అందుకోని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అనుకూలమైన ఒక బీసీ నాయకుడు నడుపుతున్న తెలుగు దినపత్రికలో ఎడిటర్ కు గత ఐదు నెలలుగా జీతాలు రాలేదు. ఇక విశిష్టమైన చరిత్ర ఉన్న పురాతన పత్రికా ఎడిటర్ కు కూడా మూడు నెలలుగా జీతాలు అందుకోలేదట.. ఎడిటర్ల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే కిందనుంచే సబ్ ఎడిటర్లు, జర్నలిస్టులు, దిగువ సిబ్బంది దుస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

ఇక ఎలక్ట్రానిక్ మీడియా విషయాని వస్తే కనీసం నాలుగు చానెళ్లు తమ జీతాలను సకాలంలో చెల్లించకలేకపోతున్నాయి. ఖర్చుల భారంతోనే రెండు ప్రధాన మీడియా సంస్థలు, ఒక టీవీ చానెల్ , వార్తపత్రిక, వారి ఎడిటర్లను మార్చేశాయి.

ఇక ఒక ఎడిటర్ను అయితే ప్రభుత్వంలోకి తీసుకొని పునరావాసం కల్పించాయి. మరో ఎడిటర్ స్వయంగా రాజీనామా చేశారు. తెలంగాణలోని రెండు ప్రసిద్ధ మీడియా సంస్థల్లో పనిచేసిన వారికి సమాచార కమిషనర్లుగా నియమించిన పరిస్థితి చూశాం. ఇక కొందరిని బయటకు వెళ్లగొట్టారు.

అగ్ర మీడియా సంస్థల్లోనూ ఇప్పుడు ఖర్చు తగ్గించే పనులు మొదలయ్యాయి. పనిచేయలేని జర్నలిస్టులను సంస్థలు వదిలించుకున్నారు. 2023 ఎన్నికల వరకూ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని.. అప్పటికీ మెరుగవుతుందని మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -