Saturday, April 20, 2024
- Advertisement -

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్…విచారణ

- Advertisement -

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయను అరెస్ట్ చేశారు. నిధులను దుర్వినియోగం చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అనుమతి లేకుండా ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు.రవిప్రకాశ్‌తో పాటు ఏబీసీఎల్‌ మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్‌ మూర్తిపై బంజరాహిల్స్‌ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కేసుల విషయానికి వస్తే….గతంలో టీవీ9 స్టూడియోకు వచ్చిన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. టీవీ 9 ఫోర్జరీ కేసు, లోగోలు అమ్ముకున్న కేసు, అక్రమ సంపాదనలపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టు కాకుండా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పాత కేసులు అలా ఉండగానే మరో ఫిర్యాదు అందింది.. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -