సుజనా, రాయపాటికి షాక్.. ఆస్తుల వేలం ఎంతో తెలుసా..?

745
Banks auction of assets on Sujana and Rayapati to recover dues
Banks auction of assets on Sujana and Rayapati to recover dues

అనుకున్నంత అయ్యింది.. ఈ టీడీపీ మాజీ నేతల బండారం బట్టబయలైంది. అధికార అండతో బ్యాంకులకు టోకరా వేసిన వీరి ఆస్తుల వేలానికి బ్యాంకులు రెడీ అయ్యాయి. ఈ మేరకు నోటీసులు జారీ చేయడం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది.

చంద్రబాబు నాయుడికి ఆర్థిక అండదండలు అందించిన నేతగా పేరొందిన సుజనా చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటికి షాక్ తగిలింది. తాజాగా వీరిద్దరికి బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వందల కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొట్టినందుకు ఆస్తులు వేలం వేస్తామని బ్యాంకులు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

గుంటూరు ఎంపీగా టీడీపీ అధికారంలో ఉన్న రాయపాటి సాంబశివరావు వ్యాపారాల నిమిత్తం ఆంధ్రా బ్యాంకు నుంచి వందల కోట్ల రుణం తీసుకున్నారు. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి 837 కోట్లు అయ్యింది. ఈ మేరకు ఆయన గుంటూరులోని కమర్షియల్ కాంప్లెక్స్, ఢిల్లీలోని ఇంటిని మార్చి 23న వేలం వేస్తామని ప్రకటించారు.

ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరికి కష్టాలు తప్పడం లేదు. బరోడా బ్యాంకుకు సుజనా చౌదరి దాదాపు 322 కోట్లు బకాయిలు పడ్డాడు. వడ్డీతో కలిపి మొత్తం 400 కోట్లు అయ్యిందట.. బాకీలు చెల్లించకపోవడంతో మార్చి 23న ఈయన ఆస్తులకు వేలం వేస్తామని బ్యాంకు నోటీసులు జారీ చేసింది. పత్రికల్లోనూ నోటిఫికేషన్ ఇచ్చింది.

చంద్రబాబు అనుంగ అనుచరులు ఇద్దరికీ బ్యాంకులు నోటీసులు రావడం.. ఆస్తుల వేలానికి రెడీ కావడం టీడీపీ శిభిరంలో ఆందోళనకు కారణమవుతోంది.

Loading...