ఏపీలో మొదలైన బార్లు. ఇక పండగే…?

280
Bars starting in Ap The longer the festival
Bars starting in Ap The longer the festival

కరోనా కారణంగా దేశంలో వైన్స్ షాప్స్ అన్ని మూసివేయబడి మొదటి అన్ లాక్ లో భాగంగా తెరుచుకున్నాయి.. కానీ బార్లకు మాత్రం ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు.దాంతో రాష్ట్రంలో గత కొంతకాలంగా బార్లు మూతపడి వెలవెలబోయాయి..

ఈ క్రమంలో ఏపీ సర్కారు బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రేపటి నుంచి రాష్ట్రంలో బార్లు తెరుచుకోనున్నాయి. 840 బార్ల లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, ఈసారి బార్ల లైసెన్సులపై కొవిడ్ రుసుం విధించారు. 20 శాతం మేర విధించిన ఈ రుసుంను 2020-21 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ వసూలు చేయనుంది. అంతేకాదు, బార్లలో మద్యం విక్రయాలపై 10 శాతం రిటైల్ పన్ను వసూలు చేయనున్నారు. లైసెన్సు రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా 10 శాతం మేర పెంచారు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Loading...