ఫేస్ బుక్ ప్రేమ‌…చివ‌ర‌కు శ‌వ‌మై తేలిన సాప్ట్ వేర్ మ‌హిళా ఇంజినీర్‌

340
Bengal women software engineer commit suicide in hyderabad

ఫేస్ బుక్‌లో ప‌రిచ‌యం అయిన ప్రేమ చివ‌ర‌కు ఆమె ప్రాణాలు తీసింది. సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌యం అయిన ప్రేమికుడికోసం హైద‌రాబాద్ వ‌చ్చి శ‌వ‌మైంది. న‌గ‌రంలోని వనస్థలిపురంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యో లాడ్జిలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన మ‌హిళ బెంగాల్ కు చెందిన ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.ఈ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివ‌రాల్లోకి వెల్తే….మూడేళ్ల క్రితం ‘ఫేస్ బుక్’ ద్వారా యువకుడు లోకేశ్ ఆమెకు పరిచయమయ్యాడు. లోకేష్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న విచారణ ప్రారంభించారు. విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

గత మూడు రోజులుగా లోకేష్‌, సంగీత కలిసి ఒయో లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగిందని లాడ్జి సిబ్బంది తెలిపారు. దీంతో సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు కాగా, లోకేశ్ వయసు 28 ఏళ్లు ఉండొచ్చని పోలీసుల విచారణలో తెలిసినట్టు సమాచారం.

Loading...