Saturday, April 20, 2024
- Advertisement -

పాకిస్తాన్ పీఎంను ఆడేసుకుంటున్న భారత టెకీలు..

- Advertisement -

భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్ కు టెక్నాలజీతో బుద్దిచెబుతున్నారు భారతీయ టెకీలు, యువ సాఫ్ట్ వేరర్లు.. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ జాతీయ జెండాను గూగుల్ లో ‘బెస్ట్ టాయిలెట్ పేపర్’ కొడితే వచ్చేలా చేసి ఆ దేశానికి దిమ్మదిరిగేలా షాకిచ్చారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు.

ఆర్టికల్ 370 రద్దు , కశ్మీర్ విభజనపై నానాయాగీ చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కు గట్టి బుద్ది చెప్పేలా ఇండియన్ టెకీలే గూగుల్ ఈ ఫొటోలను ఆ ట్యాగ్ లను పెట్టినట్టు సమాచారం. దీంతో పాకిస్తాన్ లో ఇప్పుడు బికారీ అని కొడితే పాకిస్తాన్ ప్రధాని ఫొటో రావడం కలకలం రేపుతోంది. ఇక బెస్ట్ టాయిలెట్ పేపర్ అని కొడితే పాకిస్తాన్ జెండా అని వస్తోంది.

ఇక గత ఏడాది ఇడియట్ అనే పదాన్ని గూగుల్ లో సెర్చ్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటో రావడంపై ఏకంగా అమెరికా సీరియస్ అయ్యింది. దాన్ని తొలగించింది. అదంతా ట్రంప్ కోపంతో కొందరు టెకీలు చేసిన మాయ అని తేలింది.

ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానిని కూడా ఇలానే భారత టెకీలు గూగుల్ లో అవమానించేలా ట్యాగ్ లు పెట్టి ఆడేసుకుంటుండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -