Friday, March 29, 2024
- Advertisement -

మద్యమో మహాప్రభో.. ఏపీలో అడుక్కోవాల్సిందేనా?

- Advertisement -

అంతన్నారు.. ఇంతన్నారు.. మద్యనిషేధం చేస్తానన్నారు. కానీ ఇప్పుడదే మద్యంపై ఆధారపడి రేట్లు పెంచేస్తున్నారు. మద్యనిషేధం దిశగా అడుగులేస్తున్న జగన్ సర్కారు తాజాగా అక్టోబర్ నుంచి అమలు చేసే కొత్త మద్యం పాలసీలో ధరలు పెంచాలని డిసైడ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

కేంద్రం నిధులు ఇవ్వదాయే.. రాష్ట్రమేమో లోటు బడ్జెట్ అయే.. పైగా జగన్ ‘నవరత్నాల’ పథకాలకు లక్షల కోట్లు కావాలి.. ఇక జీతాలు, మెయింటనెన్స్ ఖర్చు బారెడు. అందుకే జగన్ సర్కారు ఎంత వద్దనుకుంటున్నా చివరు ఖజానాకు బంగారు బాతు లాంటి ఆదాయం తెస్తున్న మద్యంపైనే ఆధారపడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా ఏపీలో మద్యం ధర మరింత పెరగనుంది. ఈ మేరకు అక్టోబర్ లో మద్యం కొత్తపాలసీ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఎంత పెంచాలనే దానిపై ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం కసరత్తు చేస్తోందట.. 10శాతం పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఉత్పత్తదారులకు ఆ లాభం పోదు. ఎక్సైజ్ డ్యూటీలు మాత్రమే ప్రభుత్వం పెంచి ఆ లాభాన్ని తన ఖాతాలో వేసుకోవాలని జగన్ సర్కారు స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం..

ఇక ప్రస్తుతం మద్యం పాలసీలో ధరను రౌండ్ ఫిగర్ పెంచే పాలసీ ఉంది. అంటే రూ.2 నుంచి 9 రూపాయలు ఎంత పెంచినా మద్యం సీసాలపై రూ.10 పెరుగడం ఖాయం.. దీనివల్ల ప్రభుత్వానికి కాసుల పంటే. ప్రస్తుతం ఎక్సైజ్ ఆదాయం ఏపీకి రూ.6220 కోట్లుగా ఇప్పుడు పెంచే రేటుతో 8517 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనావేస్తోంది. అంటే 2297 కోట్లు అదనం. ఇక ఇది ఎక్సైజ్ ఆదాయం మాత్రమే. ఇంకా ఎక్సైజ్ డ్యూటీ, అదనపు డ్యూటీ, బార్లు,వైన్స్, పబ్ ల లైసెన్స్ ఫీజులు, జరిమానాలు, వ్యాట్ తదితరాలు కలిపి ఎక్స్ జ్ శాఖకు 5వేల కోట్ల ఆదాయం పైమాటే వస్తుందట..

సో మద్యం నిషేధం చేస్తానన్న జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పథకాల అమలు భారం తెలిశాక ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో కానీ.. మద్యం రేట్లను మాత్రం పెంచేసి ఖజానా నింపేసుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఆశిస్తున్న ఆదాయం వస్తుందా లేదా అన్నది అక్టోబర్ తర్వాత తేలనుంది.మద్యం ప్రియులు మాత్రం అక్టోబర్ నుంచి ఓ పది, ఇరవై రూపాయలు ఎక్కువే జేబులో వేసుకొని బార్ షాప్ లకు వెళ్లాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -