Thursday, March 28, 2024
- Advertisement -

తెల్లారితే శుభకార్యం… ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపిన పాలగిన్నె

- Advertisement -

తెళ్లారితే శుభకార్యం కోసం కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతున్న వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడాదిన్నర్ర బాలుడు పాలగిన్నెలో పడి మరణించారు. ఈ సంఘటన అంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెత్తే….తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు సుంకులమ్మ కాలనీకి చెందిన లోకేశ్వరయ్య, చంద్రిక దంపతులకు ఇద్దరు కుమారులు. దేవాన్ష్ వీరిలో చిన్నవాడు.

ఆదివారంలో వారి ఇంట్లో శుభకార్యం ఉండటంతో భోజనాల నిమిత్తం పెరుగు కోసం శనివారం రాత్రి పాలను వేడి చేసి… పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఫ్యాన్ కింద వుంచారు.ఆడుకుంటూ వెళ్లిన దేవాన్ష్ ఆ గిన్నెలో పడిపోయాడు. పాలు వేడిగా ఉండటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే బాలుడిని గిన్నెనుంచి బయటకు తీసి ఆసుపత్రిలోని ఆసపత్రికి తరలించారు. అయితే అక్కడనుంచి మెరగైన వైద్య చికిత్స కోసం కర్నూలుకు తీసుకెల్తుండగా తీవ్ర గాయాలపాలయిన దేశాన్ష్ దారిలోనె ప్రాణాలు వదిలారు.శుభకార్యం జరగాల్సిన ఇంట ఇలా జరగడంతో.. గ్రామంలో విషాదం అలుముకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -