Friday, March 29, 2024
- Advertisement -

అప్పగించమని అడిగితే చూస్తాం

- Advertisement -

బ్యాంకులకు ఎగనామం పెట్టి బ్రిటన్ పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను భారత్ కు పంపలేమని బ్రిటన్ స్పష్టం చేసింది. తమ దేశంలోని 1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం తమకు ా అధికారం లేదని పేర్కొంది. అయితే భారత్ మాత్రం తమకు విజయ్ మాల్యాను అప్పగించాలని కోరితే ఆ విషయాన్ని పరిశీలిస్తామని బ్రిటన్ పేర్కొంది.

తమ చట్టం ప్రకారం ిబ్రిటన్ లో పాస్ పోర్టు పొందిన వారు దాని గడువు ముగిసే వరకూ ఇక్కడే ఉండవచ్చునని, అందుకే మాల్యాను పంపడం కుదరదని పేర్కొంది. అయితే మాల్యాను అప్పగించాలని భారత్ కోరితే మాత్రం తాము తప్పక సహకరిస్తామని ఆ దేశం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు మాల్యాను అప్పగించాలని బ్రిటన్ ను కోరతామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుఫ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. మాల్యా నుంచి రావాల్సిన 9400 కోట్ల రూణాలు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -