Saturday, April 20, 2024
- Advertisement -

డ్యాన్సింగ్ ఎరోప్లేన్ @యూకే

- Advertisement -

ఎరిక్ ఇప్పుడు యూకేను షేక్ చేస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌తో గంట‌కు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి ఎవ‌రూ బ‌య‌టికి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌లోని ప్రధాన నగరాల్లో ఎరిక్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎయిర్‌పోర్ట్‌ల‌పై కూడా ప‌డుతోంది. బ‌లంగా వీచే ఈదురుగాలులు విమానాల ల్యాండింగ్‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. విమానాలను ల్యాండ్ చేయ‌డానికి అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల్సి వస్తుంది. మ‌చ్చుకు ఈ వీడియో చూడండి.

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ 276 విమానానికి ఎంత ప్ర‌మాదం త‌ప్పిందో చూశారా. ఈ విమానం హైదరాబాద్‌ నుంచి లండన్‌ హీత్రోకు శుక్రవారం ఉదయం 7.19 గంటలకు బయలుదేరింది. హీత్రో విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.36 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. ఎరిక్ త‌న ప్ర‌భావాన్ని చూపుతూనే ఉంది. అయినప్పటికీ పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. ఈ సమయంలో ఈదురు గాలులకు విమానం అటూ ఇటూ ఊగిపోయింది. రన్‌వేను తాకిన సెకెన్లలోనే మ‌ళ్లీ విమానాన్ని గాల్లోకి లేపారు పైలెట్లు. తిరిగి 18 నిమిషాల తరవాత మళ్లీ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -