Wednesday, April 17, 2024
- Advertisement -

కరోనా వైరస్ కు విరుగుడు మందు కనిపెట్టిన చెన్నై డాక్టర్..!

- Advertisement -

ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది కరోనా వైరస్. ఈ వైరస్ చైనాలో పుట్టింది. అక్కడ ఇప్పటికే వందమందికి పైగా మృతి చెందారు. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఇతర దేశాలతో పాటు చైనా కుడా పలు చర్యలు తీసుకుంటుంది. ఈ వైరస్ భారత్ కూడా వచ్చేందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వైరస్ కు విరుగుడు కోసం అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చైన్నైకి చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడు తన వద్ద కరోనా వైరస్ కు విరుగుడు ఔషదం ఉందని చెబుతున్నాడు. దీనిని సేవిస్తే 24 గంటల నుంచి 48 గంటల మధ్య క్యూర్ అవుతుందని చెబుతున్నారు. చెన్నైలోని రత్నసిద్ధ ఆసుపత్రిలో డాక్టర్ తనికసాలంవేణి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇతనికి సిద్ధ – ఆయుర్వేదిక్ వైద్యంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. కరోనా వైరస్ విషయం తెలియగానే వన మూలికల ద్వారా విరుగుడు ఔషదం తయారు చేసినట్లు చెప్పారు. సహచర వైద్యులు కూడా సహకరించారని చెప్పారు.

ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు చైనా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ అనుమతిస్తే ఆయన తన టీంతో కలిసి చైనాకు వెళ్లేందుకు సిద్ధమని చెబుతున్నారు. తాము తయారు చేసిన ఈ ఔషదం ఏ రకైమన వైరల్ కైనా పని చేస్తుందని అన్నారు. డెంగ్యూ – మల్టీ ఆర్గాన్ ఫీవర్ వంటి వివిధ రోగాలకు ఇది పని చేస్తుందని చెబుతున్నారు. చైనా – భారత్ అంగీకరిస్తే తాను మెడిసిన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -