Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ పై వ్యాఖ్యల ఎఫెక్ట్….టీడీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు…

- Advertisement -

టీడీపీ అధికారం కోల్పోవడంతో సీఎం వైఎస్ జగన్ పై నేతలు చేస్తున్న విమర్శలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సీఎం అనే గైరవం లేకుండా పచ్చపార్టీ అధినేత బాబు నుంచి మొదలు కొని మాజీ మంత్రుల వరకు అందరూ జగన్ ను ఇస్టమొచ్చినట్లు మాట్లాడుుతున్నారు. తాజాగా జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు అయ్యింది. విశాఖ త్రీ టౌన్ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడుపై ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థలో కూడా రౌడీయిజం పెరిగిపోయిందని… ముఖ్యమంత్రి జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నా… డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారని ఆయన విమర్శించారు. విశాఖపట్టణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని… ఇలాంటి ప్రాంతంలోకి కడప సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అయ్యన్న విమర్శించారు. వైసీపీ నేతలు అయనపై పిర్యాదు చేయడంతో ఆయన మీద కేసునమోదయ్యింది. అధికారం కోల్పోయామనె ధ్యాస లేకుండా ఇస్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తె ఫలితం ఇలానె ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -