Thursday, April 25, 2024
- Advertisement -

రంగంలోకి సీబీఐ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు

- Advertisement -

సీఎంగా వందరోజుల పాలనలో జగన్ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అధిక శాతం హామీలను అమలు చేసిన ఘనత వైఎస్‌​ జగన్‌కే దక్కించుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వంద రోజుల‌పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ఇదలా ఉంటె సీబీఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ జగన్ తో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాద పూర్వకంగా ఆయన కలిశారు.అకస్మాత్తుగా వీరిద్దరూ భేటీ అవ్వడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గత టీడీపీ హయాంలో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా బాబు నిషేధం విధించారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయ్యింది.

సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి అనుమతి ఇచ్చారు. అయితే మొదటి సారిగా ఏపీలో సీబీఐ తొలి కేసుకు జగన్ సిఫార్లు చేశారు.టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

కొద్ది రోజుల క్రితం సీఐడీ హైకోర్టుకు అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించి నివేదిక అందించింది. ఇందులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమాలకు పాల్పడ్డారని నివేదిక తెలిపింది. దీంతో హైకోర్టు ఈ కేసును సీబీఐ విచారణను జగన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.ఇప్పుడు ఏపీ కేబినెట్ ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణకు ఆదేశించటంతో ఆయనకు ఉచ్చు బిగిసినట్లే కనిపిస్తోంది.

కొద్దినెలల క్రితం రాష్ట్రంలో అవినీతి కేసుల విచారణలో సీబీఐకు అనుమతి నిరాకరిస్తూ గత ప్రభుత్వం నిషేధం విధించింది. గతేడాది నవంబర్ 8న సీబీఐ దర్యాప్తునకు సాధారణ సమ్మతిని నిరాకరిస్తూ జీవో నెంబర్ 176ను టీడీపీ సర్కార్ జారీ చేసింది.ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ జీవో నెంబర్ 81ను విడుదల చేశారు. జగన్‌తో మరో సారి సమావేశం అవుతామని చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు. దీన్ని బట్టి చూస్తె యపరతినేని చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుటుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -