Wednesday, April 24, 2024
- Advertisement -

ఆయేషా మీరా హ‌త్య‌కేసులో దూకుడు పెంచిన సీబీఐ…

- Advertisement -

హైకోర్టు ఆదేశాల నేపద్యంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హ‌త్య‌కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసుకు సంబందించిన సాక్ష్యాల ధ్వంసం చేసిన వ్య‌వ‌హారంపై విజ‌య‌వాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది.కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు, దోషులను రక్షించేందుకు యత్నించారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

అయేషా మీరా హత్య కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిట్ ఇన్వెస్టిగేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ త‌న ప‌నిని ప్రారంభించింది.

2007 డిసెంబర్‌ 26న విజయవాడలోని ఓ హాస్టల్‌లో అయేషా మీరాపై అత్యాచారంచేసి హ‌త్య చేశారు. ఈ కేసులో నిందుతుడు సత్యంబాబు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే స‌రైన సాక్ష్యాలు లేక‌పోవ‌డంతో హైకోర్టు స‌త్యంబాబును నిర్దోషిగా విడుద‌ళ చేసింది.

త‌మ కూతురును చంపింది ఎవ‌రో మాకు తెలియాల‌ని అయేషా త‌ల్లిదండ్రులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిలో భాగంగా అయేషా హ‌త్య కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది. దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ స్వేచ్ఛతో వ్యవహరించొచ్చని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -