అలోక్ వ‌ర్మ‌కు బిగ్ షాక్‌..సీబీఐ బాస్ ప‌ద‌వినుంచి తొల‌గించిన హైప‌ర్ క‌మిటీ

488
CBI vs CBI : CBI Director Alok Verma Sacked by High-Powered Committee
CBI vs CBI : CBI Director Alok Verma Sacked by High-Powered Committee

సీబీఐ డైరెక్ట‌ర్ ప‌ద‌వి అలోక్ వ‌ర్మ‌కు ఒక రోజు ముచ్చ‌ట‌గానే మిగ‌లిపోయింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన హైప‌ర్ క‌మిటీ ప‌ద‌వినుంచి తొల‌గించింది. గురువారం నాడు సుమారు రెండు గంటలకు పైగా సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ కూడ అలోక్‌ వర్మపై వేటు వేసింది.

ఆయనపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్థారించిన హైప‌ర్ కమిటీ.. మోదీతోపాటు జస్టిస్ సిక్రి ఆయనను తొలగించాలన్న నిర్ణయానికి మద్దతుగా నిలిచారని, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారని తెలుస్తోంది.

సీబీఐ బాస్‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదంతో ఆయ‌న‌ను సీబీఐ డైరెక్ట‌ర్ ప‌ద‌వినుంచి తొల‌గించి సెల‌వుపై పంపింది కేంద్రం. అయితే త‌న‌ను సెల‌వుపై పంప‌డం అన్యాయం అని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అలోక్ వ‌ర్మ‌ వాద‌న‌తో పుప్రీంకోర్టు ఏకీభ‌వించింది. ఆయ‌న‌ను తిరిగి సీబీఐ డైరెక్ట‌ర్‌గా నియ‌మించాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. ఎలాంటి విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోరాద‌ని సుప్రీం కోర్టు తెలిపింది. ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌న‌ల‌పై హైప‌ర్ క‌మిటీని నియ‌మించింన సంగ‌తి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని హైపవర్ కమిటీ తేల్చింది. ఈ మేరకు ఆలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించడానికి కొన్ని గంటల ముందే.. అలోక్ ఐదుగురు సీబీఐ అధికారులను బదిలీ చేశారు. ఆయన పదవిలో చేరిన రోజు 10 మంది అధికారుల బదిలీలను రద్దు చేశారు. ప్ర‌స్తుతం అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది