Tuesday, April 23, 2024
- Advertisement -

సీబీఐ వ‌ర్సెస్ సీబీఐ.. సీబీఐ వివాదాన్ని సీవీసీకి అప్ప‌గించిన సుప్రీం

- Advertisement -

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీవీసీని ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది

తనను సీబీఐ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని ధర్మాసనం దీనిపై నేడు విచారణ జరపనుంది. న్యాయవాదులు ఫాలి నారిమన్, సంజయ్ హెగ్దే వర్మ తరుపున కోర్టులో వాదనలు వినిపించారు.

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన ఎం. నాగేశ్వరరావు కేవలం అడ్మినిస్ట్రేటివ్ వ్యహరాలను మాత్రమే చూడాలని కోర్టు ఆదేశించింది. పాలనపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను బదిలీ చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.సీబీఐ డైరెక్టర్ పై విచారణకు మూడు వారాల గడువును సీవీసీ కోరింది. కానీ రెండు వారాలు మాత్రమే సుప్రీం ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -