Friday, April 26, 2024
- Advertisement -

రాష్ట్రానికి కేంద్రం తీపి క‌బురు..

- Advertisement -

కేంద్ర‌ప్ర‌భుత్వం ఏపీకీ తీపిక‌బురు అందించింది. క‌రువు సాయం కింద రూ.900.40 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. విప‌త్తులు, క‌రువుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన ఆరు రాష్ట్రాల‌కు . ఒక కేంద్ర‌పాలిత ప్రాంతానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రత్యేక నిధుల నుంచి 7,214.03 కోట్ల రూపాయలను మంజూరు చేస్తు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది.

ప్రకటించిన మొత్తంలో హిమచల్‌ ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన నష్టానికి సహాయంగా 317.44 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు వరద సహాయంగా 191.73 కోట్లు, ఏపీకి కరవు సహాయంగా 900.40 కోట్లు, కర్ణాటకకు కరవు సహాయంగా 949.49 కోట్లు, మహారాష్ట్రకు కరవు సహాయంగా 4,714.28 కోట్లు, గుజరాత్‌కు కరవు సహాయంగా 127.60 కోట్లు, పుదుచ్చేరికి తుపాన్‌ సహాయంగా 13.09 కోట్ల రూపాయలు కేటాయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -