Wednesday, April 24, 2024
- Advertisement -

సీబీఐ విషయంలో జగన్ నిర్ణయాన్ని ఒప్పుకున్న బాబు….?

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మడత రాజకీయాల్లో ఆరితేరారు. దేశంలో అలాంటి రాజకీయాలు చేసేదెవరని గుర్తుకు తెచ్చుకుంటే ముందు బాబు పేరే వినిపిస్తూంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట…అధికారం కోల్పోయాక ఇంకోమాట మాట్లాడటం ఆయనకే చెల్లుతుంది.బాబు చేస్తున్న కుష్టురాజకీయం గురించి మేధావులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ఛీ కొడుతున్నా బాబు బుద్ది మారడంలేదు. అన్ని తెలిసీ నాకెందుకులే అనుకన్నారేమోగాని తన రాజకీయ పంథాను మార్చుకోవడంలేదు. దేశంలో ఉన్న వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకోవడం సీన్ రివర్స్ అయితే వాటిని ఛీ కొట్టడం అలవాటుగా మారింది. తాజాగా కోడెల మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తె ఎంత నీఛానికి దిగజారిపోయారో తెలుస్తోంది.

అసలు విషయానికి వస్తే…బాబు హయాంలో రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా నిషేధం విధించారు. బాబు బినామీలుగా చెప్పుకొనె సుజనా, సీఎం రమేష్ లపై సీబీఐ,ఈడీలు దాడులు చేసింది. కేసులను సీబీఐ విచారిస్తే ఎక్కడ తమ నేతలు అరెస్ట్ అవుతారోనని తెగ భయపడ్డారు బాబు.అలాంటి బాబు ఇప్పుడు పనిగట్టుకుని మరీ సీబీఐ ఎంక్వయిరీ కావాలంటూ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లతుంది.

కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని, అలాంటి ఎంక్వయిరీ ఏజెన్సీ ఏపీకి అక్కర్లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరి అప్పుడు తప్పుగా కనిపించిన సీబీఐ ఇప్పుడు నిష్పాక్షికంగా ఎందుకు విచారణ చేపడుతుంది. అప్పుడూ ఇప్పుడూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, చంద్రబాబుకి వారు వైరిపక్షం కాబట్టి కేంద్రం నిర్ణయాలు వ్యతిరేకంగా ఉంటాయి.

కోడెల మరణాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటున్న బాబు ఇంకొన్ని రోజులు అలాగే చేయాలని దానికోసమే సీబీఐ విచారణను కావాలంటున్నారని అర్థమవుతోంది. ఓవైపు పోస్టుమార్టమ్ రిపోర్ట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలం అన్నీ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తేలాల్సింది కోడెల కొడుకు వ్యవహరం. అంతే కాదు మిస్సింగ్ అయిన ఆయన పర్సనల్ ఫోన్ దొరికితే నిజాలు వెలుగులోకి వస్తాయి.

సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్న బాబు.. గతంలో తాను కేంద్ర దర్యాప్తు సంస్థని రాష్ట్రంలోకి రావద్దంటూ తీసుకున్న నిర్ణయం తప్పు అని ఒప్పుకున్నట్టేనా..?అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించడం సరైన నిర్ణయం అని మద్దతు తెలిపినట్టేనా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తర్వాత బాబు సీబీఐ ఎంక్వయిరీ కోరితే బాగుండేది. బాబ చేస్తున్న శవరాజకీయాలను చూసి సొంత పార్టీనేతలే ఛీదరించుకుంటున్నారు. అయినా కూడా బాబు తన వక్రబుద్ధిని చూపించడం మాత్రం మానుకోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -