చంద్రబాబు కోసం డైలాగ్స్ రాస్తున్న పరుచూరి బ్రదర్స్ :

238
chandrababu naidu is preparing speech and songs for him

ఎలాంటి కార్యక్రమానికి నాంది పలికినా గానీ దానికి మీద భారీ ప్రచారం చేసుకోవడం చంద్రబాబు నాయుడు కి మొదటి నుంచీ అలవాటైన విషయమే. ముఖ్యమంత్రిగా అయన మొదటిసారి చాలా సంవత్సరాలు అంటే దాదాపు తొమ్మిది ఏళ్ళు పని చేసిన సమయం లో కూడా ఆయన ఈ రకంగానే ప్రవర్తించారు. తన పాలన గురించి తానే డబ్బా కొట్టుకోవడం పథకాల గురించి హడావిడి చెయ్యడం ఈయనకి కొత్తేమీ కాదు. రుణమాఫీ, పించన్ పథకాలూ, చంద్రన్న కానుకలూ అంటూ చేసేది తక్కువే అయినా చెప్పుకునేది ఎక్కువ అన్న చందంగా సాగుతుంది ఈయన వ్యవహారం.

ఇంతవరకూ ఆయన ప్రకాహ్రం చేసుకున్నాడు సరిపోవడం లేదు అనుకున్నారో ఏమో గానీ సినిమా రచయితలు పరుచూరి ప్రదర్స్ తో చాలా సేపు భేటీ అయ్యారు చంద్రబాబు. సినిమా రచయిత అనంత శ్రీరాం కూడా చంద్రబాబు ని కలవడం విశేషం. త‌న ప్ర‌సంగాల‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా, ప్ర‌భావ‌వంతంగా ఉండేలా తీర్చి దిద్దేందుకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సాయం చేయ‌బోతున్నార‌ట‌! ప్ర‌భుత్వ ప‌థ‌కాలతోపాటు, తెలుగుదేశం ప్ర‌జ‌ల‌కు ఎంత మేలు చేస్తోంద‌న్న విష‌యాన్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఎలా త‌న ప్ర‌సంగాల్లో ఇమ‌డ్చ‌వ‌చ్చు అనేది చంద్ర‌బాబు చ‌ర్చించార‌ట‌.

అంటే, ఇక‌పై చంద్ర‌బాబు ప్ర‌సంగాలు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసి ఇస్తారేమో! ఇక‌, అనంత్ శ్రీ‌రామ్ తో  కూడా కొన్ని పాట‌లు రాయించుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల క‌లుగుతున్న మేలు గురించీ, తెలుగుదేశం స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు చేస్తున్న ఉప‌కారం గురించి ఆ పాట‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. సో.. ఇక‌పై చంద్ర‌బాబు ప్ర‌సంగాలు కూడా సినిమా డైలాగుల్లా ఉంటాయేమో!

Loading...