Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రయాన్-2 పై వివాదాస్ప‌దం అయిన హ‌ర్భ‌జ‌న్ ట్విట్‌….

- Advertisement -

చంద్ర‌యాన్ 2ను విజ‌య‌వంతం కావ‌డంతో యావత్‌ భారతం హర్షం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది ఇస్రో. శాస్త్ర‌వేత్త‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇస్రో కీర్తిని అన్ని రంగాల ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్‌ల‌తో అభినందించారు.

తాజాగా హ‌ర్భ‌జ‌న్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. కొందరూ భజ్జీ ఆసక్తికర ట్వీట్‌ను సమర్ధిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తూ.. ఘాటు కామెంట్స్‌ చేస్తున్నారు. కొన్ని దేశాలు తమ జాతీయ జెండాలపై చంద్రున్ని ఉంచుకున్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం ఆ చంద్రునిపైనే తమ జెండాలను పాతాయి’ అని చంద్రయాన్‌-2 ప్రయోగం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ భజ్జీ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌లో ఆయా దేశాల జెండాలను సైతం జతచేశాడు. అయితే ఈ ట్వీట్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముందుగా పాకిస్తాన్ ఆ తర్వాత టర్కీ, తునీసియా, లిబ్యా, అజెర్‌బైజన్, అల్జీరియా, మలేసియా, మాల్దీవులు, మౌరిటానియాలు తమ జాతీయ జెండాలపై చంద్రుడితో కూడిన గుర్తు ఉంచుకుంటాయి. వాటితో పాటు రెండో వాక్యంలో అమెరికా, రష్యా, ఇండియా, చైనాలు చంద్రుడిపై జెండా ఎగరేశాయంటూ తెలిపాడు. భజ్జీపై ట్వీట్ల దుమారం చెలరేగుతుంది.


Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -