Friday, March 29, 2024
- Advertisement -

చివరిలో చంద్రయాన్ 2 విఫలం…దేశం మొత్తం మీవెంటేన్న మోదీ

- Advertisement -

దేశంతోపాటు ప్రపంచ యావత్తు ఎంతగానో ఎదురు చూసిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విఫలం అయ్యింది. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి.మరో నిమిషంలో చంద్రుడిపై దిగుతుందనగా అకస్మాత్తుగా సిగ్నల్స్ ఆగిపోవడంతో శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు.

చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో తెలిపింది. శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ప్రధాని మోడీ అభినందించారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని, దేశమంతా శాస్త్రవేత్తల వెంట ఉంటుందన్నారు.

అర్ధరాత్రి దాటాక 1:38 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడిపైకి దూసుకొస్తున్న విక్రమ్ ల్యాండర్ వేగాన్ని తొలుత విజయవంతంగా తగ్గించగలిగారు.పది నిమిషాల తర్వాత ‘ఫైన్ బ్రేకింగ్’ దశ కూడా విజయవంతమైంది. జాబిల్లికి విక్రమ్ ల్యాండర్‌కు మధ్య గల దూరం 2.1 కిలోమీటర్లు ఉందనగా సమస్య మొదలైంది. ‘విక్రమ్’ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్‌ట్రాక్)లో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది. సంకేతాల కోసం కాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని, సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ కె.శివన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

చంద్రయాన్ 2 ప్రయేగం అనంతర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి అంకంలో తడబాటుకు గురవడంపై శాస్త్రవేత్తలకు మోదీ ధైర్య వచనాలు చెప్పారు. యావత్ దేశం మీవెంటే ఉందని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు వారెన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో అర్థం చేసుకోగలమన్నారు. దేశం కోసం జీవితాన్నే త్యాగం చేశారని శాస్త్రవేత్తలను కొనియాడారు.

శాస్త్రవేత్తల కష్టం వారి కళ్లలో కనిపిస్తోందన్నారు. వారు చేసిన ప్రయోగాలతో ప్రతీ భారతీయుడు గర్వంగా తలెత్తుకుంటున్నాడని, వారిని చూసి జాతి గర్వంతో పొంగిపోతోందని అన్నారు. వైఫల్యాలు మనల్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాల్లో భారత్‌ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. దానికోసం మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -