Friday, April 26, 2024
- Advertisement -

ప్రధాని మోదీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా…

- Advertisement -

చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలోనే విక్రమ్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ భారత పౌరుడు ఉద్వేగానికి లోనవుతున్నాడు. ఇప్పటిదాకా చంద్రయాన్‌-2 యాత్ర అప్రతిహితంగా కొనసాగడానికి ఎనలేని కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.

మోదీ ప్రసంగిస్తూ సైంటిస్టుల ఆవేనదంతా వారి ముఖంలోనే కనిపిస్తుందని తెలిపారు. దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. యావత్ దేశం మీవెంటే ఉందని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రధానికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన ఇస్రో ఛైర్మన్ శివన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయి కన్నీళ్లుపెట్టుకున్నారు. ఈ సున్నితమైన, ఉద్వేగభరిత సందర్భాల్లో మోడీ స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. శివన్‌ను దగ్గరకు తీసుకుని ఆయన ఓదార్చి విధానం యావత్ దేశ ప్రజలను ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -