Friday, March 29, 2024
- Advertisement -

ఇస్రోశాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం….

- Advertisement -

చంద్రయాన్-2 ప్రయోగం దాదాపు విఫలమైన నేపథ్యంలో యావత్తు దేశప్రజలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకూడా ఇస్రో శాస్త్రవేత్తకు అండగా నిలిచారు. ప్రధాని మోదీ సైతం.. సైన్స్‌లో ప్రయోగాలు మాత్రమే ఉంటాయని, వైఫల్యాలు ఉండవని వ్యాఖ్యానించి వారికి మద్దతు తెలిపారు.

ఇదలా ఉంటె ఇస్రో శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది.అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్ సభ్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కోత విధించింది.ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి జీతాల్లో కోత పడింది.దీనికి సంబంధించిన జీవో జూన్‌ 12వ తేదీన విడుదల చేసింది కేంద్రం.దీని ప్రభావంతో 90 శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున రూ.10వేల మేర తగ్గనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం 1996లో ఎస్‌డీ స్థాయి నుంచి ఎస్‌జీ స్థాయి ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే మోదీ నాయకత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని ఇస్రోలోని స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. ఇస్రో చైర్మన్‌ శివన్‌ను కలిసి.. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకులా చూడాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 సాంకేతిక లోపాలతో చివరి నిమిషంలో విఫలం అయిన సంగతి తెసిందే.చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సమయంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి.. అయితే, విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని తర్వాత ఇస్రో గుర్తించింది.. విక్రమ్ ల్యాండర్ తో అనుసంధానం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -