చైనాలో మరో కొత్త వైరస్.. ఇది మరి డేంజర్..!

1260
china reports suspected bubonic plague case
china reports suspected bubonic plague case

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దాంతో ప్రజలు బయటకు రావాలంటనే వణికిపోతున్నారు. ఈ వైరస్ కు మందు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు ఈ కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కరోనా కారణంగా చాలా మంది చనిపోయారు. మరెంతో మంది చికిత్స పొందుతున్నారు.

ఇంత భయకరమైన పరిస్థితి వెళ్లిపోకముందే.. మంగోలియాలో ‘బుబోనిక్‌ ప్లేగు’ వైరస్ వెలుగులోకి వచ్చిందని చైనాలోని బయాన్నూర్ నగర అధికారులు హెచ్చరించారు. ఈ వైరస్ లక్షణాలైన జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింపు గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధి పందికొక్కు మాంసం తినడం వల్ల వీరికి వచ్చినట్లు గుర్తించారు. దీంతో అతనికి కలిసిన వారిని ఐసోలేట్ చేశారు.

ఈ వ్యాధి మానవుల నుండి మానవులకు తొందరగా వ్యాపిస్తోందని.. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. 19వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధితో పోలిస్తే, ఇది మరింత బలమైనదని చెబుతూ నగరంలో మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ సంవత్సరం చివరి వరకూ ఈ హెచ్చరికలు అమలులో ఉంటాయని తెలిపారు.

దేశం కోసం అండగా ఉంటాం.. ప్రధానితో సీఎం జగన్..!

డేంజర్ లో భారత్.. ఒక్కరోజే 2003 మంది మృతి..!

దేశానికి మేఘా రక్షణ కవచం

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

Loading...