Thursday, April 25, 2024
- Advertisement -

ఏఐ టెక్నాల‌జీలో డ్రాగ‌న్ కంట్రీ మ‌రో ముంద‌డుగు

- Advertisement -

అన్ని రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న చైనా.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో కూడా దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ర‌క్ష‌ణ రంగంతో పాటు.. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఉప‌యోగిస్తున్న డ్రాగ‌న్ కంట్రీ.. ఇప్పుడు వార్త‌ల‌ను చ‌ద‌వ‌డానికి కూడా రోబోల‌ను వినియోగిస్తుంది.

చైనా అధికారిక న్యూస్ ఛానల్ జిన్హువా ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ మహిళా న్యూస్ రీడర్‌తో వార్తలు చదివించి ఆశ్చర్యపరిచింది. ఏఐ న్యూస్ రీడర్ వచ్చే నెలలో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువడానికి సిద్ధంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. గ‌తేడాది చైనాలో జ‌రిగిన‌ ప్రపంచ ఇంటర్నెట్‌ సదస్సులో ఈ ఏఐ పురుష న్యూస్‌ రీడర్‌ను జిన్హువా ఛానల్‌ ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది అరంగేట్రం చేసిన పురుష న్యూస్ యాంక‌ర్‌.. ఈ ఏడాది మ‌హిళా న్యూస్ రీడ‌ర్‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డం విశేషం.

చిన్న హెయిర్‌కట్, పింక్ డ్రెస్ వేసుకొని చెవులకు ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని ఒక నిమిషం పాటు వార్తలు చదివిన వీడియోను జిన్హువా విడుదల చేసింది. మనిషిలాగే హావభావాలు, కదలికలు, భావోద్వేగాల‌ను వ్యక్తం చేయ‌డం ఈ రోబో పత్యేకత. ఒక ప్రొఫెషనల్‌ న్యూస్‌ యాంకర్‌ వార్తలు ఎలా చదువుతారో అదే విధంగా చదవి వినిపించింది ఈ రోబో. ఈ యాంక‌ర్ కేవ‌లం చైనీస్ మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుందా అనేదానిపై స్పష్టత లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -