Thursday, April 25, 2024
- Advertisement -

గ‌తి త‌ప్పిన చైనా స్పేస్ స్టేష‌న్‌…. భూమికి పెనుప్ర‌మాదం..త‌ప్ప‌దా….?

- Advertisement -

భూమికి పెను ప్ర‌మాదం సంభ‌వించ‌నుంది. చైనాకు చెందిన అంత‌రిక్ష‌కేద్రం భూమిపై కూలిపోనుంది. చైనాకు చెందిన తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్ నియంత్ర‌న కోల్పోవ‌డంతో భూమిపై కూలిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్ స్టేషన్ భూమి మీద పడితే తీవ్ర విధ్వంసం త‌ప్ప‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంతరిక్ష పరిశోధనల కోసం చైనా ప్రత్యేకంగా తియాంగాంగ్‌-1 పేరుతో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించుకుంది. సుమారు 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్‌ స్టేషన్‌ అంతరిక్షం నుంచి భూమిపైన పడబోతోంది. తియాంగాంగ్‌-1.. 2016 మార్చిలోనే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది. అప్పటినుంచి ఆకాశంలో పరిభ్రమిస్తూ.. నెమ్మదిగా భూమివైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని సైంటిస్టులు చెబుతున్నారు. అదే జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలోని 43 డిగ్రీల అక్షాంశాల మధ్య ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి – మార్చి మధ్యకాలంలో భూమిమీద భీకరంగా కూలిపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ స్పేస్ స్టేషన్ ఎక్కడ కూలిపోతే ఆ ప్రాంతంలో జీవ రాశి పూర్తిగా నాశనమయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు.పెద్ద పెద్ద భవనాలతో పాటు అన్నీ దెబ్బతినే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, బీజింగ్‌, రోమ్‌, ఇస్తాంబుల్‌, టోక్యో నగరాలున్నాయి. తియాంగాంగ్‌-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది.

మ‌రో వైపు తియాంగాంగ్‌ – 1 కూలిపోవడం వల్ల భూమికి వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదని చైనా చెబుతోంది.ఇప్పటికే స్పేస్‌ స్టేషన్‌లోకి కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని.. స్పేస్‌ ఇంజినీరింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వూ పింగ్‌ అంటున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే.. స్పేస్‌ స్టేషన్‌ మండిపోతుందని.. ఆయన అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -