Friday, March 29, 2024
- Advertisement -

కొత్త మంత్రులకు సీఎం జ‌గ‌న్ కేటాయించిన శాఖలు ఇవే

- Advertisement -

నవ్యాంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన హోంమంత్రిగా మేకతోటి సుచరిత నియమితులయ్యారు. నవ్యాంధ్రకు తొలి హోంమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు.శనివారం ఏపీ సెక్రటేరియెట్‌ ప్రాంగణంలో మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.

మేకతోటి సుచరిత – హోంశాఖ
పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమం
ధర్మాన కృష్ణదాస్ – రోడ్లు, భవనాల శాఖ
బొత్స సత్యనారాయణ – మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
అవంతి శ్రీనివాస్ – పర్యాటక శాఖ, కల్చరల్ యూత్ అడ్వాన్స్ మెంట్
మేకపాటి గౌతంరెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
అనిల్ కుమార్ యాదవ్ – జలవనరులు, నీటిపారుదల శాఖ
కురసాల కన్నబాబు – వ్యవసాయం, సహకార శాఖ
తానేటి వనిత – మహిళా శిశుసంక్షేమం
కొడాలి నాని – పౌరసరఫరాల శాఖ
మోపిదేవి వెంకటరమణ – పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్
పినిపె విశ్వరూప్ – సాంఘిక సంక్షేమ శాఖ
ఆళ్ల నాని – వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
పిల్లి సుభాష్ చంద్రబోగ్స్ – రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
వెల్లంపల్లి శ్రీనివాస్ – దేవాదాయ శాఖ
గుమ్మనూరి జయరాం – కార్మిక, ఉపాధి శాఖ
బాలినేని శ్రీనివాసరెడ్డి – విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆదిమూలపు సురేశ్ – విద్యాశాఖ
పెద్దిరెడ్డి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు
అంజాద్ భాషా – మైనారిటీ వ్యవహారాల శాఖ
నారాయణస్వామి – ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ
శంకర్ నారాయణ – బీసీ సంక్షేమ శాఖ
శ్రీరంగనాథరాజు – గృహనిర్మాణశాఖ
పేర్ని నాని – రవాణా, సమాచార శాఖ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -