Thursday, March 28, 2024
- Advertisement -

మ‌రో సారి ప్ర‌జ‌ల మ‌నిషే అనిపించుకున్న జ‌గ‌న్…మ‌న‌సున్న మారాజు

- Advertisement -

నాయకుడు అంటే ప్రజల కష్టాలు తెలిసినవాడు..ప్రజలకు భరోసా ఇచ్చేవాడు..ప్రజల కష్టం తన కష్టంగా భావించే వారు..అలాంటి నాయ‌కులు ఇప్పుడు బూత‌ద్దంతో వెతికినా దొర‌క‌రు. అలాంటి నేతలు ఇప్పుడు ఉన్నారా అంటే పలానా అని చెప్పే పరిస్థితిలో ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. డబ్బు ఇస్తే ఓటు అమ్మేస్తారు..మద్యం పోస్తే ఓటు మనకే గ్యారంటె అనే మీమాంసలో రాజకీయ నాయకులు బతుకుతున్నారు.

కాని అలాంటినాయ‌కులు కూడా ఉంటార‌ని జ‌గ‌న్‌ను చూసిన త‌ర్వాతే క‌నిపించింది. ఇలాంటి సమయంలో ఓ యువకుడు జ‌గ‌న్ .. తాను ఓ గొప్ప రాజకీయ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చానని బేష‌జాల‌కు పోకుండా ప్ర‌జ‌ల‌మ‌ధ్య‌నె ఉంటున్నాడు.ప్రజల సమస్యలు చూశాడు..గడప గడపకు తిరుగుతూ నే విన్నాను..నే ఉన్నాను..అంటూ ప్రజలకు భరోసా ఇచ్చాడు. ఎండా..వానా..చలి ఏవీ లెక్కచేయకుండా రాష్ట్రానికి బంగారు భవిత ఇవ్వడమే తన లక్ష్యం అంటూ ముందుకు సాగాడు. నాయ‌కుడు అంటె ఇలా ఉండాల‌ని ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకున్నారు. ఆయ‌వ‌కుడు ఎవ‌రో కాదు….న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.

తాజాగా విశాఖ‌లో మ‌రో సారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నాడు. జ‌గ‌న్ శార‌దాపీఠం వెల్లి వ‌స్తుండ‌గా అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. జగన్ శారదాపీఠం సందర్శన కోసం ఈ ఉదయం విశాఖ వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టు వద్ద కొందరు టీనేజర్లు బ్యానర్లతో నిలుచున్నారు. నీరజ్ అనే తమ స్నేహితుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, అతడికి సాయం చేయాలని కోరుతూ బ్యానర్లలో పేర్కొన్నారు. అయితే ముందుగా జ‌గ‌న్ బ్యాన‌ర్లు చూడ లేదుగాని…తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో కాన్వాయ్ ని ఆపి వారి స‌మ‌స్య‌ను తెలుకున్నాడు.

నీరజ్ అనే కుర్రాడు కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని చికిత్సకు సాయం చేయాలంటూ వారు సీఎంను కోరారు. స్నేహితుడి పట్ల వారు చూపిస్తున్న తాపత్రయం జగన్ ను కదిలించింది. వెంట‌నె యువ‌కుడి వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. జగన్ నిర్ణయం పట్ల నీరజ్ స్నేహితులు హర్షధ్వనాలు చేశారు.

నీరజ్ కుమార్‌… విశాఖలోని జ్ఞానాపురంకు చెందిన అప్పల నాయుడు, పద్మ దంపతుల కుమారుడు. ఇంటర్మీడియట్‌లో ఉండగా అతడికి బ్లడ్‌ కేన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీరజ్‌ ఆపరేషన్‌కు రూ. 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్థిక సాయం కోసం వారు చేసిన ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను అర్థించారు. సీఎం జగన్‌ తక్షణమే స్పందించడంతో నీరజ్‌ ఆపరేషన్‌కు జిల్లా కలెక్టర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -