Friday, April 19, 2024
- Advertisement -

జ‌గ‌న్ దెబ్బ‌కు బాబు ఇంకో నియోజ‌క వ‌ర్గం చూసుకోవాల్సిందేనా..?

- Advertisement -

రాష్ట్రంలో టీడీపీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. భాజాపా అప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు బాబు కుదేల‌వుతున్నారు. కీల‌క నేత‌లంగా ఒక్క‌క్క‌రే పార్టీని వీడుతున్నారు. తాజాగా బాబు సొంత నియోజ‌క వ‌ర్గం కుప్పంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టారు. కుప్పంను అభివృద్ధిచేసి బాబుకు చెక్ పెట్టాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీకి అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉన్నారట. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని.. పురపాలక శాఖ ఆదేశాలు పంపించిందంట‌. ఈనెల చివ‌రి నాటికి ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారంట‌.

నగర పంచాయతీలో విలీనం చేయాల్సిన గ్రామాలు, పంచాయతీల వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారుల్ని పురపాలకశాఖ ఆదేశించింది. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ప్రతిపాదనలు పంపితే.. వాటిని పరిశీలించి నగర పంచాయతీగా మార్చేందుకు కసరత్తు చేయనున్నారు.

కుప్పం నగర పంచాయతీలోకి చుట్టు పక్కల ఉన్న 8 పంచాయతీలతోపాటు అలాగేగుడుపల్లె మండలంలో మరో మూడు పంచాయతీలు విలీనం చేయాల్సి ఉంటుంది. కుప్పంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 22,303 మంది ఉంటే.. కుప్పంకు చుట్టుపక్కల ఉన్న 11 పంచాయతీలు విలీనం చేస్తే ఆ సంఖ్య 49,574కు చేరుతుందట. జ‌గ‌న్ స్పీడ్ చూస్తుంటె వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి బాబు మ‌రో నియోజ‌క వ‌ర్గాన్ని వెతుక్కోవాల్సిన అవ‌స‌రం రావ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -