Friday, March 29, 2024
- Advertisement -

మరో సంచలనానికి తెరతీసిన సీఎం జగన్..?

- Advertisement -

రాష్ట్రంలో జగన్ తాను మేనిఫెస్టో లో ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా వాటి అమలు ఎలా జరుగుతుందని ప్రజల వద్దకు వెళ్లి మరీ అయన తన పాలనా ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా గతంలో ఏ సీఎం చేయని పనిచేస్తున్నారని ఆయనను ప్రజలంతా పొగుడుతున్నారు.. ప్రతి ఒక్క నాయకుడు ఎదో చేసేస్తామని, బ్రతుకులు మార్చేస్తామని చెప్పి ఎన్నికలప్పుడు కనపడిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలకు దాకా కానీ కనిపించడు అలాంటిది జగన్ మీద నమ్మకం తో ఓటు వేస్తే ఇన్నాళ్లకు ఒక మంచి నాయకుడొచ్చాడని ప్రజలు చెప్పుకుంటున్నారు..

ఇక ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం. ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు.. కానీ జగన్ వాటిని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు.. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు నిరూపిస్తే చాలు అని ప్రజల్లోకి వెళ్లి మరీ తనని తాను కాపాడుతున్నాడు..

ఇక కోవిడ్‌ వల్ల ప్రపంచం అంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఏపీలో మాత్రం వైఎస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్‌ను ప్రకటించారు. రెండు నెలల కాలంలో ఏ ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయబోతున్నామన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 21 న వైఎస్సార్‌ బీమా పథకం, అక్టోబర్‌ 27 న వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత, నవంబర్‌ 6 జగనన్న తోడు, నవంబర్‌ 10 న రైతులకు సున్నా వడ్డీ రుణాలు, నవంబర్‌ 13 ఆరోగ్యశ్రీ పథకం 2వేల వ్యాధులకు మిగిలిన ఆరు జిల్లాలకు వర్తింపు, నవంబర్‌ 17 జగనన్న వసతి దీవెన పథకాలు ప్రారంభిస్తున్నారు..

జగన్ లేఖ రాస్తే తప్పేముంది.. ఎందుకింత సీన్..?

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

జనాల్లోకి జగన్.. బాబు ఇంటికేనా..?

జగన్ కొత్త కాబినెట్ లో పదిమంది కొత్తవారిని తీసుకుంటాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -