గ్రామ వార్డు, సచివాలయ పరీక్షాల ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్…

326
CM YS Jagan released grama and sachivalayam results
CM YS Jagan released grama and sachivalayam results

జగన్ ప్రభుత్వం ప్రతీష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ,సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు, ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన పరీక్షలకు 19.74 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 8 వరకూ పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా 19 రకాల ఉద్యోగాల భర్తీకి 14 పరీక్షలు చేపట్టింది.ఈ ఫలితాలను ప్రభుత్వ వెబ్ సైట్ http://gramasachivalayam.ap.gov.in/ లో చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తిచేసిన 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, వచ్చే నెల 1న రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం గాంధీజయంతి(అక్టోబర్ 2) రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది

Loading...