రెండేళ్ల‌లో ప్రభుత్వ స్కూల్స్ రూపు రేఖలు మారుస్తాం….

189
CM YS Jagan to attend Rajanna Badibata programme
CM YS Jagan to attend Rajanna Badibata programme

సీఎం వైఎస్ జ‌గ‌న్ చ‌ద‌వుల విప్ల‌వానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అన్ని ప్ర‌భుత్వ స్కూల్స్ రూపురేఖ‌ల‌ను రెండు సంవ‌త్స‌రాల్లో మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట కార్యక్రమంలో’ ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. సుదీర్ఘంగా నిర్వహించిన పాదయాత్రలో పిల్లల చదువును తాను తీసుకొంటానని మాట ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ మాటను ఇవాళ నిలబెట్టుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.పిల్లలను బడులకు పంపిస్తే వచ్చే ఏడాది జనవరి 26 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పండుగను నిర్వహించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే నాడు బడికి పంపే ప్రతి విద్యార్ధి తల్లికి రూ. 15వేలు ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

అన్ని ప్ర‌భుత్వ స్కూల్స్‌ల్లో ఇంగ్లీషు మీడియంను త‌ప్ప‌ని స‌రి చేయాల‌ని జ‌గ‌న్ అధికారుల‌ను సూచించారు. అదే విధంగా తెలుగును తెలుగు బోధన తప్పనిసరి చేయనున్నట్టుగా సీఎం ప్రకటించారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చి దిద్దుతామ‌న్నారు.

Loading...