Wednesday, April 24, 2024
- Advertisement -

దిల్ రాజు చిర‌కాల కోరిక‌ను నెర‌వేర్చినున్న‌ సీఎం వైఎస్ జ‌గ‌న్‌….?

- Advertisement -

టీటీడీ నేత‌న ఛైర్మెన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. టీడీపీనేత పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే వైవి బాద్య‌త‌లు స్వీక‌రించారు. మొద‌ట కాలిన‌డ‌క‌న తిరుమ‌ళ‌కు వెల్లిన వైవి కుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం గురుడళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. వారంరోజుల్లో కొత్త పాల‌క మండ‌లి ఏర్పాటు అవుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇద‌లా ఉంటె కొత్త పాల‌క మండ‌ళిలో ప్రుముఖ నిర్మాత‌, డైరెక్ట‌ర్ దిల్‌రాజు చిర‌కాల కోరిక‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ నెర‌వేర్చారు. దిల్ రాజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యే అవకాశాలున్నా మెండుగా క‌నిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు కూడా పాల్గొన్నారు. దిల్ రాజు వెంకటేశ్వర స్వామి భక్తుడు. తన బ్యానర్ కు కూడా శ్రీవారి మీద భక్తితోనే దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు.

దిల్ రాజును టీటీడీ పాల‌క మండ‌లిలో స‌భ్యునిగా నియ‌మించ‌డానికి ప్ర‌ధానం కార‌నం సీఎం కేసీఆర్‌తో జ‌గ‌న్‌కు ఉన్న సాన్నిహిత్య‌మే. దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుదడిగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో జ‌గ‌న్‌కు ఉన్న సాన్నిహిత్యంతో జగన్ కేటీఆర్ సూచనకు వెంటనే అంగీకరించినట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -