Friday, April 19, 2024
- Advertisement -

గోదావ‌రి జ‌లాల‌ను శ్రీశైలానికి త‌ర‌లించాలి….కేసీఆర్‌, జ‌గ‌న్‌

- Advertisement -

విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రించుకోవ‌డానికి ఇద్ద‌రు లు సీఎంకేసీఆర్‌, జ‌గ‌న్‌లు దృష్టిసారించారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న ఘ‌ర్ష‌న‌ల‌కు చెక్ పెట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. దీనిలో భాగంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌, జ‌గ‌న్ లు భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మంత్రులు , ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ప్ర‌ధానంగా న‌దీజ‌లాల మ‌ధ్య‌నే చర్చ జ‌రిగింది. కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను పూర్తిగా వినియోగించుకోవాల‌ని సీఎంలు నిర్ణ‌యానికి వ‌చ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకలలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రీతిలో మరిచిపోయి, మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు.

ప్ర‌ధానంగా కృష్ణాన‌దిలో నీటి ల‌భ్య‌త త‌క్కువ‌గా ఉన్నందున గోదావ‌రి నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -