Saturday, April 20, 2024
- Advertisement -

అప్పుడు మీడియా.. ఇప్పుడు బాలీవుడ్‌ను కాటేసిన కోబ్రా

- Advertisement -

కోబ్రాపోస్ట్‌.. ఓ రెండు తెలుగు మీడియా ఛాన‌ళ్ల‌ను వ‌ణికించింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏ మీడియా హౌజ్ డ‌బ్బులు తీసుకొని ప్ర‌జ‌ల‌ను ఏమార్చుతారో సాక్ష్యాధారాల‌తో స‌హా రుజువు చేసింది. ఈ సారి బాలివుడ్ స్టార్ల‌పై గురి పెట్టింది కోబ్రా పోస్ట్‌. సోష‌ల్ మీడియాను ఉప‌యోగించి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను త‌ప్పు దాడి ప‌ట్టిస్తున్న 36 మంది బాలీవుడ్ సెలబ్రిటీల బండారాన్ని బ‌య‌ట‌పెట్టింది.

సింగ‌ర్స్ అభిషిత్ భ‌ట్టాచార్య‌, కైలాష్ ఖేర్‌, మికా సింగ్‌, బాబా సెహ‌గ‌ల్‌, ఇక యాక్ట‌ర్స్ విష‌యానికి వ‌స్తే వివేక్ ఒబేరాయ్‌, జాకీ ష్రాఫ్‌, శ‌క్తి క‌పూర్‌, సోనూ సూద్‌, అమిషా ప‌టేల్‌, మ‌హిమా చౌద‌రి, టిస్కా చోప్రా, రాఖి సావంత్‌, పూన‌మ్ పాండే, స‌న్ని లియోన్‌, రాజ్‌పాల్ యాద‌వ్‌.. ఇలా చెప్పుకుంటు పోతే లిస్ట్ పెద్ద‌గానే ఉంది.

వీరంతా ఒక్క ట్వీట్ చేయ‌డానికో.. ఓ పోస్ట్ పెట్ట‌డానికో రెండు నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటున్నారు. ఇందులో చాలా ర‌కాలైన ప్యాకేజ్‌లు కూడా ఉన్న‌ట్టు తెలిసింది. 8 నెల‌ల ప్యాకేజ్‌కు 20 కోట్ల చొప్పున తీసుకుంటున్నార‌ట కొంద‌రు న‌టులు.

వీళ్లు ట్వీట్ లేదా పోస్ట్ చేయ‌డానికి రేట్లు ఎలా ఉన్నాయంటే సన్నీలియోన్ నెలకు రూ.75 లక్షలు.. వివేక్ ఒబేరాయ్ నెలకు రూ.80లక్షలు, శక్తి కపూర్ నెలకు రూ.75లక్షలు.. రోహిత్ రాయ్ నెలకు రూ.30 లక్షలు చొప్పున ట్వీట్లకు అందుకుంటున్నారు. గాయకుడు బాబా సెహగల్ ఒక్కో ట్వీట్ కి రూ.2లక్షలు చెల్లించాల్సిందే. ఇక ఇతర స్టార్లు ఎంత మొత్తాలు అందుకుంటారు? అన్నది తెలియాల్సి ఉంది.

అప్ప‌ట్లో తెలుగు మీడియాలోని ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛాన‌ళ్లు కూడా డ‌బ్బులు తీసుకుంటూ కొంద‌రికి అనుకూల‌మైన వార్త‌ల‌ను టెలికాస్ట్ చేయ‌డానికి ఒప్పుకొని అడ్డంగా దొరికిన విష‌యం తెలిసిందే క‌దా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -