Tuesday, March 19, 2024
- Advertisement -

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. ఎంత దొరికిందో తెలుసా?

- Advertisement -

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఇంటిపై కొద్దిరోజులుగా ఐటీ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే.. చంద్రబాబును, టీడీపీని ఈ దాడులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 2వేల కోట్లు పట్టుబడ్డాయని.. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని వైసీపీ నేతలు ప్రచారం చేశారు.

అయితే తాజాగా చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై ఐటీ శాఖ అధికారికంగా పంచనామా నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మాజీ పీఎస్ శ్రీనివాస్ రావు ఇంట్లో ఎంత దొరికిందనేది వెల్లడించింది.

వైసీపీ శ్రేణులు ఆరోపించినట్టు చంద్రబాబు ఇంట్లో 2వేల కోట్లు దొరకలేదు.. ఆ సోదాల్లో కేవలం 2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ అధికారికంగా తెలియజేసింది. దీంతో వైసీపీ ఆశలు అడియాశలయ్యాయి. టీడీపీ శిబిరం కూడా ఊపిరిపీల్చుకుంది.

కాగా చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో శ్రీనివాసరావు అన్నీ తానై వ్యవహరించాడన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టులు, సెటిల్ మెంట్లు సహా ఎన్నో చక్కదిద్దేవారని విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఐటీ దాడుల్లో ఆయన వద్ద ఏం దొరకకపోవడంతో టీడీపీ శిబిరంలో ఆందోళన తగ్గింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -