అక్ర‌మ క‌ట్ట‌డం ప్ర‌జావేదిక‌ కూల్చివేత దాదాపు పూర్తి …అక్ర‌మార్కుల‌కు హెచ్చ‌రిక‌..?

361
Contunue second day Demolition of prajavedikare building
Contunue second day Demolition of prajavedikare building

సీఎం వైఎస్ జగ‌న్ యాక్ష‌న్‌లోకి దిగ‌నంత వ‌ర‌కే…..దిగితే మాత్రం ద‌బిడి దిబిడి అవ్వాల్సిందే. రాజ‌ధాని ప్రాంతంలో క‌ర‌క‌ట్ట మీదున్న అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కుపాదం మోపారు. ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాల‌కు పూర్తి విరుద్ధం అక్ర‌మంగా నిర్మించిన ప్ర‌జావేదిక కూల్చివేత రెండు మూడు గంట‌ల్లో పూర్త‌వుతుంది. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన‌లు అక్ర మార్కుల గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి.

మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది.

వాస్తవానికి ఈ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ… ఊహించని విధంగా నిన్న రాత్రి నుంచే పనులు మొదలు పెట్టారు. మరోవైపు, ప్రజావేదికతో పాటు కరకట్ట ప్రాంతాన్ని మొత్తం భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు.

మరోవైపు ప్రజావేదిక కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనంటూ తన వ్యాజ్యంలోనే పలుమార్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ఈ భవనం అక్రమమా? కాదా? పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అక్రమమేనంటూ పిటిషనర్‌ అంగీకరించారు. అలాంటప్పుడు ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని ప్రశ్నించిన హైకోర్టు ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామన్ని హైకోర్టు స్పష్టం చేసింది.

Loading...