మీరు రెస్టారెంట్ కి వెళ్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..?

285
corona attack if you went restaurant
corona attack if you went restaurant

కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులలో భాగంగా అన్ని తెరుచుకోమని చెప్పగా వాటిలో రెస్టారెంట్ లు కూడా తెరుచుకున్నాయి.. అయితే కొత్త అధ్యయనం ప్రకారం రెస్టారెంట్ కెళ్లి తినేవాళ్లు రెండింతలు కరోనా బారినపడ్డారట .

The Morbidity and Mortality Weekly Reportను US Centers for Disease Control and Prevention ఈ విషయం బైటపెట్టింది. 18 ఏళ్ల మించిన వాళ్లపైన అధ్యయనం చేశారు. వీళ్లందరూ కోవిడ్ బాధితులే. వీళ్ళలో ఎక్కువమంది చెప్పింది ఒక్కటే…మేం రెస్టారెంట్లకెళ్లాం.

కరోనారాని వాళ్లను అడిగారు. వాళ్లలో చాలా తక్కువమంది మాత్రమే రెస్టారెంట్లకెళ్లాం….అక్కడే తిన్నాం అని చెప్పారు. రెస్టారెంట్లకెళ్లి తిన్నవాళ్లలో రెండింతల మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అదే హోటల్స్ జోలికెళ్లనవాళ్లలో ఎక్కువమందికి నెగిటీవ్ వచ్చింది.

Loading...