Friday, April 19, 2024
- Advertisement -

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం.. కొత్త‌గా 86,052 పాజిటివ్ కేసులు

- Advertisement -

చైనాలో పుట్టుకు వచ్చిన కరోనా ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యానికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇక భారత్ లో మార్చి నుంచి మొదలైన ఈ కేసుల పరంపర రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. పలు రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,052 కేసులు నమోదు కాగా, 1141 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 81,177 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

రోజుకు సమారు 90వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో కేవలం ఐదు రాష్ట్రాల నుంచి నమోదవుతున్న కేసులే సగం కంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా భారీగానే ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు దేశంలో 6,89,28,440 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
దేశంలో మొత్తం 58,18,571 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,70,116 ఉండగా, 47,56,164 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 92,290 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 81.74 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.59 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.67 శాతంగా ఉంది.

తెలంగాణలో కరోనా జోరు.. కొత్తగా 2,176 కరోనా కేసులు!

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం విషమం!

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి కరోనా పాజిటీవ్ ?

రష్యా వ్యాక్సిన్ సక్సెస్ కాలేదా..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -