Saturday, April 20, 2024
- Advertisement -

సూర్యపేటలో దారుణం : అష్టా చమ్మా ఆడి.. కరోనా అంటించింది..!

- Advertisement -

కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే కరోనా ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో నిరూపితమైంది. ఓ మహిళ అష్టా చమ్మా ఆడటం వల్ల ఏకంగా 31 మందికి కరోనా సోకింది. సూర్యపేట జిల్లలో ఈ ఘటన జరిగింది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది.

ఈ సందర్భంగా తబ్లిగ్ జమాత్ మీటింగ్ కు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన ఓ మహిళ ద్వారా 31 మందికి కరోనా సోకినట్టు ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి వచ్చింది. తనకు కరోనా సోకినట్లు తెలియని ఆ మహిళ… లాక్ డౌన్ వేళ టైమ్ పాస్ కోసం సమీపంలోని పలు ఇళ్లలో తిరిగుతూ అష్టా చమ్మా ఆడారు. దీంతో ఆమె కాంటాక్ట్‌ అయినవారిలో చాలా మందికి కరోనా సోకింది. ఇది కూడా జిల్లాలో పెద్ద ఎత్తున కేసుల పెరుగుదలకు ఒక​ కారణం అయింది. కాగా, ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 83 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన తర్వాత సూర్యపేటలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆధికారులు.

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కనీసం పక్కింటికి కూడా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు సూర్యాపేటలో కరోనా నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై పలువురు ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి నిరంజన్‌ బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో బీ శ్రీనివాసరావును నియమించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -