Friday, April 19, 2024
- Advertisement -

అమెరికా అతలాకుతలం.. 10 లక్షల కరోనా కేసులు..!

- Advertisement -

కరోనా వైరస్ కారణగా అగ్రరాజ్యం దారుణంగా మారుతోంది. తాజాగా అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు వెళ్లింది. అమెరికా వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజు ఏకంగా 1741మంది మృతి చెందడం కలకలం రేపింది. ముఖ్యంగా జార్జియా ఒక్లహామా అలస్కా టెక్సాస్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ మినహాయింపులతో కార్యకలాపాలు తాజా ప్రారంభమయ్యాయి. దాంతో కరోనా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో పనులు ప్రారంబించడానికి అక్కడి గవర్నర్లు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు.

ఇక ఇటీవల అమెరికాలో కరోనా రోగుల చికిత్సలో డిస్ ఇన్ఫెక్టంట్స్ ఇంజెక్షన్లు అతినీలలోహిత కిరణాల వినియోగంపై ట్రంప్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో విలేకరులు ఎలాగూ దీనిపై రచ్చ చేసి ఇరుకునపెడుతారని ట్రంప్ తన మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్వీట్ లో మీడియాను కడిగి పారేశారు. ‘మీడియా వారు ఎలాగూ రిపోర్ట్ చేయరు.. వారికి మంచి రేటింగ్స్ కోసం తప్పుడు వార్తలు రాస్తారు.. దాంతో సమయం పని వృథా’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

*ఇక రష్యాలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఏకంగా 6361 కేసులు నమోదయ్యాయి. 66 మంది చని పోయారు. మొత్తం మరణాల సంఖ్య 747కు చేరింది.
*స్సెయిన్ లో కొత్తగా 288 కేసులు నమోదయ్యాయి. పారిస్ లో లాక్డౌన్ లో ఇంట్లో ఉండ లేక ఆదివారం జనాలు రోడ్లమీదకొచ్చారు.

  • బ్రిటన్ దేశంలో కరోనాతో 413మంది మరణించారు.
    *ఇరాన్ లో మృతుల సంఖ్య 5710కి చేరింది.
    *సింగపూర్ లో 13వేల కేసులు దాటాయి. కొత్తగా 931మంది కరోనా బారిన పడ్డారు.
    *బంగ్లాదేశ్ లో 31మంది ఆలయ సిబ్బందికి కరోనా సోకింది.
    *స్పెయిన్ లో కేసుల సంఖ్య తగ్గడంతో లాక్ డౌన్ ను కాస్త సడలించారు. 14 ఏళ్లలో పు పిల్లలు తండ్రులతో కలిసి కి.మీలోపు గంట పాటు బయట ఆడుకునేందుకు అనుమతిచ్చారు. 44 రోజుల తర్వాత ఆదివారం వీధుల్లో చిన్నారుల సందడి కనిపించింది.
    *ఇక కరోనా పుట్టిన చైనాలోని వూహాన్ లో ఆదివారం ఒక్క కేసు నమోదు కాలేదు. వూహాన్ లో 50333 కేసులు నమోదయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -