Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా సోకిన వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ?

- Advertisement -

ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతున్న విషయం తెల్సిందే. కరోనా పాజిటివ్ వస్తే వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో ఇంటి నుండి ఆసుపత్రికి చేరుకుని మళ్లీ అతడిని అరోగ్యంతో ఇంటికి చేరేంత వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తోంది. బాధితులు హాస్పిటల్ లో చేరిన దగ్గర నుంచి కోలుకుని ఇంటికి వెళ్లే వరకు ఖర్చు భారీగా అవుతోంది. ఆసుపత్రిలో చేరిన వారికి భోజనం, మందులు, చికిత్సకు మొత్తం అయ్యే ఖర్చు గురించి మొదటిసారిగా బయటకు తెలిసింది.

కరోనా బాధితులు కోలుకునేందుకు ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష నుంచి ఇంటికి చేరే వరకు ఒక్కో వ్యక్తిపై రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. కరోనా లెక్కలు ఓ అంచనా వేశారు. ఏ ఏ పరీక్షలకు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందో చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4500 అవుతుందట. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఇలా మూడుసార్లు పరీక్షలు చేస్తారు. అందుకు గాను రూ.13500 చొప్పున ఖర్చు అవుతోంది. ఇక కరోనా అనుమానితులను అంబులెన్స్ లో తీసుకొస్తారు. డిశ్చార్జి చేసిన వ్యక్తిని ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి పంపుతారు. ఈ రవణా ఖర్చు రూ.4 వేలకు పైగా అవుతోందని అంచనా. పాజిటివ్ సోకిన వరకు చికిత్స పూర్తయ్యేవరకు దాదాపు కనీసం 80 వరకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు వినియోగిస్తారు.

అయితే ఆ కిట్లను ఒక్కసారికి మాత్రమే వాడవచ్చు. వాటిని తిరిగి వాడలేం. ఆ ఒక్క కిట్ ధర రూ.2500కు పైగా. దీంతో ఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖర్చు అవుతోంది. ఇక కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నవారికి అధికంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక కరోనా నుంచి కోలుకునేందకు మందులు ఇస్తారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచేందుకు వారికి యాంటీ బయాటిక్ యాంటీ వైరల్ మందులు ఫ్లూయిడ్స్ తదితర మందులు అందించేందుకు రూ.50 వేలకు పైగా ఖర్చవుతోంది. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందినన్ని రోజులు భోజనం అందిస్తారు. బాగా తింటే రోగ నిరోధక శక్తిని పెరుగుతందని భావించి వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు.

రోజు ఉదయం అల్పాహారం రెండుసార్లు భోజనం డ్రైఫ్రూట్స్ పాలు బ్రెడ్ నాలుగు నీళ్ల సీసాలు ఇస్తున్నారు. దీనికయ్యే ఖర్చు రూ.55 వేలు. వీటితోపాటు రోగులు వాడేందుకు సబ్బులు శానిటైజర్ ప్రత్యేక డ్రెస్ వంటివి ఇస్తుండగా వాటికి రూ.27 వేలు కూడా ఖర్చవుతోంది. వీటన్నిటి లెక్క వేస్తే మొత్తం ఒక్క రోగికి దాదాపు రూ.మూడున్నర లక్షల వరకు ఖర్చవుతోందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే రోగి కోలుకునేందుకు ప్రభుత్వాలు ఎంతైన ఖర్చు చేయడానికి వెనకడటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -