Friday, March 29, 2024
- Advertisement -

కరోనా వైరస్ ఏ జంతువు నుంచి వచ్చిందంటే ?

- Advertisement -

2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ బయటపడింది. దాంతో ఆ దేశాన్ని ఈ వైరస్ నాశనం చేసింది. కరోనా కారణంగా చైనా మొత్తం షట్ డౌన్ లో ఉంది. ఇక ఈ వైరస్ చైనా నుంచి ఒక్కోక్క దేశానికి వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. 2లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచనే వణికిస్తున్న ఈ వైరస్ ఏ జంతువు నుంచి వచ్చింది ? దీనికి మూలం ఏంటి ? అనేది ఇంకా మిస్టరీగానే ఉంది.

కరోనాకు మూలం ఏంటో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజా అధ్యయనం లో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఏ జాతి జంతువులో కరోనా వచ్చింది అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గబ్బిలం ద్వారా వచ్చిందా పాంగోలిన్ ద్వారా వచ్చిందా లేక మరో జంతు జాతి నుండి వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది. కరోనా వైరస్ కి మూలం తెలుసుకునేందుకు చేసిన పరిశోధనలో బీటా కరోనా వైరస్ ను కనుగొన్నారు. ఇవి ప్రధానంగా గబ్బిలాల్లో ఉంటాయి. యునాన్ ప్రావిన్స్లో సేకరించిన రినోలోఫస్ అఫినిస్ జాతి గబ్బిలం నుండి వేరుచేయబడిన RaTG13 ఇటీవల SARS-CoV-2 కు సమానమైనదిగా గుర్తించారు. జన్యు శ్రేణులు 96శాతం సమానంగా ఉంటాయి.

ఈ ఫలితాలు గబ్బిలాలు రినోలోఫస్ జాతికి చెందిన ప్రత్యేక జాతులలో SARS-CoV SARS-CoV-2 వైరస్ లు కలిగి ఉన్నాయని సూచించాయి. అదే సమయంలో మరో జాతికి చెందిన జంతువు జన్యువు పైనా పరిశోధనలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 7 SARS-CoV-2 కి దగ్గరగా ఉన్న వైరస్ పాంగోలిన్ లో కనుగొన్నారు. 99శాతం జన్యు సంబంధమైన సమన్వయం తో ఇది గబ్బిలాల కంటే ఎక్కువ జలాశయాన్ని సూచించింది. మలేషియా పాంగోలిన్ నుండి వేరు చేయబడిన కరోనా వైరస్ జన్యువు SARS-Cov-2 కు తక్కువ సారూప్యతను కలిగి ఉందని ప్రస్తుతం 90శాతం జన్యు సంబంధమైన సమన్వయంతో సమీక్షలో ఉంది.

పాంగోలిన్లో వేరుచేయబడిన వైరస్ ప్రస్తుతం ఉధృతంగా ఉన్న COVID-19 అంటువ్యాధికి కారణం కాదని ఇది సూచిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ కు మూలం కనుగొనే ప్రయత్నాలు శాస్త్రవేత్తలు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కు కారణ్ చైనీయులే అని.. వారి ఆహారపు అలవాట్లు కారణంగానే ఈ వైరస్ వచ్చిందని.. వారు గబ్బిలాలు కుక్కలు పిల్లులు పాంగోలిన్ వంటి వాటిని తింటారని.. అందుకే ఈ వైరస్ వచ్చిందని కొందరు మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -