కరోనా కాదు.. మద్యం చంపుతోంది..

758
Coronavirus Effect Suicide for Alcohol
Coronavirus Effect Suicide for Alcohol

కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. 21 రోజులపాటు దేశంలో లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలుతో రవాణ వ్యవస్థ స్తంభించింది. విద్యా, వ్యాపార సంస్థలు, విమాన, రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. అదేవిధంగా మద్యం, బెల్టుషాపులను బంద్ చేయించారు. దీంతో తెలంగాణ మద్యం దొరకని పరిస్థితి ఏర్పడింది.

లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరకడం లేదని తెలంగాణలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం శోచనీయంగా మారింది. మద్యం దొరకడం లేదని బంజారా హిల్స్ లోని ఇందిరానగర్ చెందిన మధు(54) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సీని పరిశ్రమలో పెయింటర్ గా పనిచేసే మధు మద్యానికి బానిసయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యంషాపులు మూతపడటంతో మద్యం దొరకకపోవడంతో మధు మతిస్థిమితం కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై మధు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరొకరు ఆత్మహత్యాయత్నం..
అదేవిధంగా పంజాగుట్టలోని బేగంపేటకు చెందిన సాయికుమార్(32) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ టైల్స్ పని చేస్తూ మద్యానికి అలవాటు పడ్డాడు. లాక్డౌన్ తో మద్యం లభించకపోవడంతో శుక్రవారం పంజాగుట్ట చౌరస్తాలోని రెండు ప్లై ఓవర్స్ మధ్య దూకి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనలో అతడి కాలు విరిగినట్లు సమాచారం. ఏదిఏమైనా కరోనా మహమ్మరిపై ప్రభుత్వాలు ఓ వైపు పోరాడుతుంటే తెలంగాణలో మాత్రం మద్యం దొరకడం లేదని ఆత్మహత్యలకు పాల్పడుతుండటం శోచనీయంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ఎవరు చనిపోలేదు. అయితే మద్యం దొరకక ఓ వ్యక్తి చనిపోవడం విచిత్రంగా మారిందని పలువురు వాపోయారు.

Loading...