Saturday, April 20, 2024
- Advertisement -

గాలి ద్వారా కూడా కరోనా వస్తుంది : పరిశోధకులు

- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ పై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వైరస్ గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని వందలాది పరిశోధకులు చెబుతున్నాయి. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలిపారు. తాజాగా ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాశారు.

కరోనా వైరస్ వ్యాప్తి దగ్గు, తుమ్ములు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపర్ల నుంచి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‍వో ఇప్పటికే చెప్పింది. గాలి ద్వారా ఆ వైరస్‌‌ వ్యాప్తి చెందుతుందన్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయలేదు. ఈ పరిశోధనల వివరాలను పరిశోధకులు కొన్ని రోజుల్లో సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురించనున్నారు. కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు కొత్తగా గుర్తించారు.

అయితే, కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయానికి సంబంధించిన ఆధారాలు సరిగాలేవని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇక ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 6,97,413 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 19,693కి పెరిగింది. 2,53,287 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,24,433 మంది కోలుకున్నారు. కరోనా కేసుల విషయంలో భారతదేశం రష్యాను అధిగమించి, టాప్-3 స్థానంలోకి చేరుకుంది.

13 ఏళ్ల బాలుడుని తండ్రిని చేసిన 25 ఏళ్ల యువతి..!

కరోనా విషయంలో భారత్ గట్టిగానే పోరాడుతోంది : మోడీ

పోల‘వరం’: కలలప్రాజెక్ట్ పూర్తికి శ్రమిస్తున్న మేఘా

బిగ్ బ్రేకింగ్ : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -