దోమల ద్వారా కరోనా వస్తుందా ? కేంద్రం ఏం చెప్పిందంటే ?

713
coronavirus is not caused by the mosquito
coronavirus is not caused by the mosquito

ప్రపంచం మొత్తం ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. మరో పక్కా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పేరుగుతున్నాయి.

ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తిపై జరుగుతున్న ఊహాగానాలకు కేంద్రం ఇప్పటికే తెరదించిన తాజాగా మరోమారు స్పష్టత నిచ్చింది. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందన్న ప్రచారం ఇప్పటికే జోరుగా జరిగింది. దీనిని ఖండించిన ప్రభుత్వం ఈ వార్తల్లో నిజం లేదని తెలిపింది. మాంసం తినడం వల్ల కరోనా రాదని స్పష్టం చేసింది. అలాగే, గాలి ద్వారా, పేపర్ల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని వివరణ ఇచ్చింది.

తాజాగా ఈ వైరస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందన్న ప్రచారం సాగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వార్తలను ఖండించింది. దోమకాటు ద్వారా వైరస్ వ్యాపించదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అలానే వెల్లుల్లి తినడం వల్ల, ఆల్కహల్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చన్న విషయంలో శాస్త్రీయత లేదని కూడా స్పష్ట చేసింది.

Loading...