చైనాలోని వూహాన్ లో కరోనా పుట్టింది.. అసలు నిజం చెప్పిన ట్రంప్..!

1276
Coronavirus Originated from China Wuhan Lab
Coronavirus Originated from China Wuhan Lab

ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరు సంపాధించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పటికే కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ కామెంట్స్ చేసిన ట్రంప్ ఇప్పుడు తాజాగా సంచలన నిజాన్ని చెప్పారు. కరనో వైరస్ పుట్టికపై ఎవరికి తెలియని విషయాలు చెప్పారు.

చైనాలోని వూహాన్ లో గల ల్యాబోరేటరితో కరోనా వైరస్ కు లింక్ ఉందని.. దీన్ని అక్కడే తయారు చేశారని అందుకు గల సాక్ష్యాధారాలు తాను చూశానని ట్రంఫ్ అన్నారు. వ్యూహాన్ ఇన్ స్టిట్యూటట్ ఆఫ్ వైరాలజీలో కరోనా వైరస్ ను సృష్టించారంటూ అమెరికా ఇంటెలిజిన్స్ విభాగంగా తేల్చినట్టు తాజాగా ట్రంప్ తెలిపారు. ఆధారాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చైనాలోని హ్యూనన్ ఫిష్ మార్కెట్ లో కరోనా వైరస్ పుట్టిందని.. గబ్బిలాల ద్వారా వ్యాపించిందని చైనా తెలిపింది.

అయితే చైనాను ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా వెనుకేసుకొచ్చింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుందని డొనాల్ట్ ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. చైనాతో కుమ్మక్కు అయ్యిందని నిప్పులు చెరిగారు. ఇక చైనాలోని వ్యూహన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందని.. తమ దగ్గర ఆధారాలు కుడా ఉన్నాయని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి దాకా ఏ ఒక్క నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదని ట్రంప్ అడిగారు. తమ దగ్గర నివేదికలున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.

Loading...